ప్రారంభమైన ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ
- సీలింగ్ ప్రక్రియ పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిద్ధిపేట, ఏప్రిల్ 03 (way2newstv.com)
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఉదయం ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ర్యాండమైజేషన్ చేసిన తర్వాత ఆర్వో, ఏఆర్వో స్థాయిలో ఈవీఎం, బ్యాలెట్ మిషనరీల కేటాయింపు చేపట్టారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణ భాస్కర్ సిద్ధమవుతున్న ఈవీఎం, బ్యాలెట్ మిషనరీల సీలింగ్ ప్రక్రియను సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, ఏసీపీ రామేశ్వర్ లతో కలిసి పరిశీలించారు.
సిద్ధిపేట ఇందూర్ కళాశాలలో..
అనంతరం కమిషనింగ్ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చిటీలు తీశారు. ఆ తర్వాత సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి మాక్ పోలింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట అర్బన్ తహశీల్దారు విజయ్, రాష్ట్రస్థాయి ఎన్నికల మాస్టర్ ట్రైనీ డాక్టర్. అయోధ్య రెడ్డి, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.