జూలై 1 నుంచి టీటీడీ కాటేజీల్లో కొత్త రూల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూలై 1 నుంచి టీటీడీ కాటేజీల్లో కొత్త రూల్స్


తిరుమల, మే 31 (way2newstv.com)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుపతిలోని టీటీడీ కాటేజీల్లో బస చేస్తారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది. ఇప్పటి వరకూ ఈ గదుల బుకింగ్‌లో ఉన్న నిబంధనల్లో టీటీడీ స్వల్పమార్పులు చేసింది. ఇవి జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా మార్పుల ప్రకారం.. విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరంట్‌ బుకింగ్‌లో మాత్రమే భక్తులు కేటాయిస్తారు. ఇక్కడ గదులు పొందిన సమయం నుంచి 24 గంటలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. 


జూలై 1 నుంచి టీటీడీ కాటేజీల్లో కొత్త రూల్స్
ఇక, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు 24 గంటల స్లాట్‌ విధానం అమల్లో ఉంటుంది. భక్తులు బుక్‌ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా నిర్దిష్ట సమయానికే ఖాళీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ గురువారం అధికంగా ఉంది. ధర్మ దర్శనానికి వైకుంఠం-2 ఎదుట రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 26 గంటలకుపైగా సమయం పడుతోంది. దీంతో మహాలఘు దర్శనాన్ని టీటీడీ అమలుచేస్తోంది. అలాగే, రూ.300 టోకెన్లు ముందస్తుగా తీసుకున్న భక్తులను ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక, శనివారం సేవలకు సంబంధించి సుప్రభాతం 50, కల్యాణోత్సవం 80 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.