ముంబై, మే 17, (way2newstv.com)
క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు మరో మెగా సంబరం మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఇక అసలు విషయానికొస్తే, ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు.
క్రికెట్ కప్ విజేతకు 28 కోట్ల ప్రైజ్ మనీ
రన్నరప్ గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్ తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు.మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ టీమ్ విజేతకు క్యాష్ అవార్డుతో పాటు ట్రోఫీని కూడా బహూకరిస్తారు. లార్డ్స్‌లో జూలై 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ కోసం మొత్తం 10 మిలియన్ల డాలర్లు ప్రైజ్‌మనీ కేటాయించారు. వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు 14 కోట్ల ప్రైజ్‌మనీ వస్తుంది. సెమీఫైనల్ చేరిన జట్లకు 8 లక్షల డాలర్లు(5 కోట్ల 61 లక్షలు) ఇస్తారు. వరల్డ్‌కప్ టోర్నీ మొత్తం 46 రోజులు జరగనున్నది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలోనూ ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ ఉంది. ఈనెల 30వ తేదీన నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలవుతాయి.
Tags:
Sports