ఇలాంటి 3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. మే 24న చూద్దాం `లీసా 3డి` గెట్ రెడీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇలాంటి 3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. మే 24న చూద్దాం `లీసా 3డి` గెట్ రెడీ

భారీ విజువల్ గ్రాఫిక్స్ కోసం 100-200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాలా? 2.0 రేంజులో గ్రాఫిక్స్ చూపిస్తేనే హిట్టు కొట్టినట్టా? అంటే అలాంటిదేమీ అవసరం లేదని అంటున్నారు మా చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్. ఆయన తెరకెక్కించిన `లీసా 3డి` ఈ సమ్మర్ సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమన్న ధీమాని కనబరుస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను ఈ నెల 24న  విడుదల చేస్తామని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ..``దెయ్యం సినిమాలకు క్రేజు తగ్గిందని భావిస్తున్నారా?  అయితే ఆ ఆలోచనను విరమించుకోవడం గ్యారెంటీ. ఇది అన్ని దెయ్యాల సినిమాల్లా రొటీన్ గా ఉండదు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా 3డిలో డిఫరెంట్ గా ప్రయత్నించిన చిత్రమిది. 


ఇలాంటి 3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. మే 24న చూద్దాం `లీసా 3డి` గెట్ రెడీ

నాణ్యమైన విజువల్స్ కోసం 8కె ఫార్మాట్ లో తెరకెక్కించి 2కె ఫార్మాట్ కి మార్చాం. ఛాయాగ్రాహకుడు పీజీ ముత్తయ్య ఈ సినిమా విజువల్స్ ని మరో లెవల్లో చూపించారు. కథ ఓకే అవ్వగానే అంజలిని ఎంపిక చేసుకోవాలనుకున్నాం. తన నటన మహదాద్భుతం. ఆద్యంతం రక్తి కట్టించే పెర్ఫామెన్సెస్ స్క్రీన్ కి మీ కళ్లను కట్టి పడేయడం గ్యారెంటీ`` అని అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..`` షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్.కె. పిక్చర్స్  ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాం. అంజలి నటించిన ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా త్రీడి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. తెలుగులో పూర్తిగా షూటింగ్ చేసిన చిత్రమిది. డిజిటల్ రూపంలో త్రీడీలో  విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రంగా రికార్డులకెక్కుతోంది. ఈ సమ్మర్ కానుకగా పిల్లలు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే పూర్తి వినోదాత్మక చిత్రమిది. ముఖ్యంగా 3డి దెయ్యం గగుర్పాటుకు గురి చేయడం గ్యారెంటీ. మే 24న  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.