9 ఏళ్లలో ఐదుగరు సీఎంలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

9 ఏళ్లలో ఐదుగరు సీఎంలు


హైద్రాబాద్, మే 28 (way2newstv.com)
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. మే 30, 2019 జగన్‌తో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్న ఆయన.. 9ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌గా కీర్తి గడించనున్నారు.ఈఎస్ఎల్ నరసింహన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు నుంచే గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతర పరిస్థితుల్లో.. డిసెంబర్ 28, 2009న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 22వ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టారు. జనవరి 22, 2010న ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 9ఏళ్లుగా గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్.. 


9 ఏళ్లలో ఐదుగరు సీఎంలు
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగుసార్లు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టిన తరువాత.. తొలిసారి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రమాణం చేయించారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో రెండోసారి ప్రమాణం చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మే 30, 2019 ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ.. వైఎస్ జగన్.. శనివారం (మే 25, 2019) రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. వైసీఎల్పీనేతగా తనను ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు తీర్మానం చేసిన కాపీని గవర్నర్‌కు జగన్ అందజేశారు. (మే 30, 2019) జరిగే తన ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను ఆహ్వానించారు.జగన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్న ఈఎస్ఎల్‌. నరసింహన్.. 9ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌గా తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.