ఆర్టీజీఎస్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ఒడిశా సర్కార్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీజీఎస్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ఒడిశా సర్కార్‌

అమరావతి మే 3 (way2newstv.com)
ఏపీ ఆర్టీజీఎస్‌కు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ‘ఫొని’ తుపాను గమనంపై ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం అందించారని.. అవి సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొంది. తుపానుపై ఆర్టీజీఎస్‌ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒడిశా ప్రభుత్వంతో పంచుకుంది. ఆ దిశగా అక్కడి ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 


ఆర్టీజీఎస్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ఒడిశా సర్కార్‌

తుపాను నేపథ్యంలో ఆర్టీజీఎస్‌ సిబ్బంది 24 గంటలూ పనిచేశారు. స్టేట్‌ కమాండ్‌ సెంటర్‌లో సీఈవో అహ్మద్‌ బాబు మకాంవేసి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతర సమాచారంపై అందించడంపై ఆర్టీజీఎస్‌ను సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ప్రశంసించారు. సీఈవో అహ్మద్‌ బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు.సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంఆర్టీజీఎస్‌ అంచనాలు బాగా పనిచేశాయని ఏపీ సీఎం చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు. అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని.. సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.