రాచకొండ కమిషనరేట్ పోలీసులు బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను శుక్రవారం యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రాం చంద్రన్, సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. హజీపూర్ గ్రామంలో గతంలో జరిగిన ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్యచేసి బావిలో పాతిపెట్టిన ఘటనపై గ్రామస్తులు భయాందోళనకు గురి కావద్దు మీ పిల్లలను దైర్యంగా స్కూల్ కు పంపండి మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, సీసీ మహేష్ భగవత్ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.
హజీపూర్ లో సీసీ కెమెరాలు
కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు మాట్లాడుతూ గ్రామాలలో మహిళలు భయబ్రాంతులకు గురికావద్దనే సదుద్దేశంతో సీపీ మహేష్ భగవత్ గారు ఈ సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు మీరు మీ పిల్లలను దైర్యంగా స్కూల్ కు పంపండి మీకు మేమున్నాం అన్నారు.మహిళలకోసం రాష్ట్రంలో "షీ" టీంను ఏర్పాటు చేశారు హైదరాబాదు భువనగిరి పట్టణాలలో ఈ ఆపీసులు ఉన్నాయి ఇప్పుడు గ్రామాలలో విస్తరించే విదంగా తగు చర్యలు తీసుకోవాలని సీపీ మహేష్ భగవత్ గారిని కోరారు సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఈ గ్రామంలో 10,60,000 రూపాయలతో 12 సీసీ కెమెరాలను ప్రారంభించాన్నారు సీపీ మహేష్ భగవత్. ఈ కెమెరాలలో 30 రోజులలో జరిగిన సంఘనలను మనం చూసే విదంగా ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులకు పోలీసులు ఇచ్చిన హమీలన్నింటిని నేరవేర్చామన్నారు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యవచ్చినా పోన్ 9490617111 మా రాచకొండ పోలీసు వాట్సప్ నెంబర్ కు పోన్ చేయండి మీ సమస్యను పకిష్కరిస్తామన్నారు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్యచేసిన బావులను మెుత్తం పూడ్చివేసి నేలమట్టం చేస్తామన్నారు. మా పోలీసు శాఖ వారికి సహకరించిన హజీపూర్ గ్రామస్తులకుసీపీ ప్రత్యేక
దన్యవాదాలు తెలిపారు.