ఓట్ల లెక్కింపుపై అధికారులకు శిక్షణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓట్ల లెక్కింపుపై అధికారులకు శిక్షణ

విజయవాడ, మే17, (way2newstv.com)
విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్ ఏ సి కళ్యాణమండపం లో శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది.  ఉదయం 10.30 వరకు ఓట్ల లెక్కింపు పై శిక్షణను పవర్ పాయింట్ ద్వారా ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వివరించారు.  ఈ కార్యక్రమానికి  25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో లు , 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది , అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్, నెల్లూరు కలక్టర్ ముత్యాల రాజు, ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ , ఈసీఐ అధికారులు అండర్ సెక్రెటరీ మధుసూదన్ గుప్తా, ఐటీ డైరెక్టర్ విఎన్ శూఖ్ల పాల్గోన్నారు. 


ఓట్ల లెక్కింపుపై అధికారులకు శిక్షణ

కౌంటింగ్ కేంద్రాల లో టేబుల్స్ ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చెప్పట్టే వీడియో కవరేజ్ అంశాలపై స్పష్టమైన సూచనలను చేశారు.   వివిపాట్ కౌంటింగ్ కేంద్రం నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ పై వివరాలు తెలియ చేశారు. మొదటగా ఆయా వీవీపాట్ స్లిపులను అభ్యర్థుల వారీగా సాగ్రిగేట్ చేసి, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అభ్యర్థుల వారిగా వివి పాట్ స్లిపులను 25 స్లిపులను ఒక బండిల్ గా సిద్ధం చేసుకోవాలి. ఆర్వో లు ఎన్నికల ఫలితాలు ప్రకటన చేసే ముందు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రకటించాలి. ముందుగా ప్రకటన చేసే సందర్భంలో ఎటువంటి రివార్డులు రావన్న విషయం గుర్తెరగాలని సూచించారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి నిబద్ధతతో, పారదర్శకత తో నిర్వహించి అభ్యర్థులకి నమ్మకం కలుగు చెయ్యవలసి మనపై ఉంది. ఖచ్చితత్వం తో కూడి ఫలితాలు ప్రతిబింబించేలా ఆర్వో లు కౌంటింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహించాలి. ఫలితాలు వెలువడిన సందర్భంలో ఎటువంటి వదంతులకు, వివాదాలకు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని అయన సూచించారు.