బెస్ట్ అవెలబుల్ స్కూల్ కి దరఖాస్తులకు ఆహ్వానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెస్ట్ అవెలబుల్ స్కూల్ కి దరఖాస్తులకు ఆహ్వానం

సిరిసిల్ల, మే,17 (way2newstv.com)
2019-2020 సం బెస్ట్ అవెలబుల్ స్కూల్స్  (రెసిడెన్షియల్) పథకంలో భాగంగా  ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లా లోని ప్రైవెటు ఆంగ్లమాధ్యమ పాఠశాలల నుండి  ధరఖాస్తులు ఆహ్వనించడం జరిగింది. ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలలకు విద్యార్ధులను (విద్యార్ధుల  ఆప్షన్ ప్రకారం) ప్రతి యేడాది కేటాయిస్తారు. 


బెస్ట్ అవెలబుల్ స్కూల్ కి దరఖాస్తులకు ఆహ్వానం

ఇందుకు గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ (రెసిడెన్షియల్) పథకంలోని విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వసతి,  భోజన వసతికి గాను ప్రతి విద్యార్ధికి యేడాది రూ.30.000 చొప్పున చెల్లిస్తారు.  ధరఖాస్తు ఫారములకు జిల్లా షెడ్యుల్ తెగల అభివృద్ది శాఖ కరీంనగర్ కార్యాలయములో సంప్రదించగలరు. ధరఖాస్తులు ఈ నెల తేది. 25-04-2019 లోపు సమర్పించవలసిన ఉంటుంది.