మూణ్ణాళ్ల ముచ్చటే.. (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూణ్ణాళ్ల ముచ్చటే.. (తూర్పుగోదావరి)

రాజమహేంద్రవరం,మే 22  (way2newstv.com): 
రంపచోడవరంలో ఏర్పాటు చేసిన తాటికల్లు నుంచి వివిధ ఉత్పత్తుల తయారీ కేంద్రం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబరులో పందిరిమామిడిలో రూ.1.29 కోట్లతో దీనిని ఏర్పాటు చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అప్పట్లో దీనిని ప్రారంభించారు. రూ.66 లక్షలతో భవనాన్ని, రూ.63 లక్షలతో ఉత్పత్తుల తయారీకి సంబంధించి యంత్ర పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఆసియాలోనే మొట్టమొదటిదని అప్పట్లో అధికారులు తెలిపారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ కేంద్రం కొద్ది రోజుల్లోనే మూతపడింది. 


మూణ్ణాళ్ల ముచ్చటే.. (తూర్పుగోదావరి)

తాటికల్లుతో తాటిబెల్లం, తాటిపంచదార, తాటిపటిక బెల్లం తయారు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఏజెన్సీలో గిరిజనుల నుంచి తాటికల్లు సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పాముగండి, పెద్దూరు, మర్రివాడ, బోలగొండ, గొట్లగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు తాటికల్లును నేరుగా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. లీటరు కల్లుకు రూ.25 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. తొలుత కొద్ది రోజులు రైతులు ఈ కేంద్రానికి కల్లు తీసుకువెళ్లారు. పట్టుమని నెలరోజులు గడవకుండానే కల్లు సరఫరా నిలిపివేశారు.ఆసియాలోనే మొట్టమొదటగా తాటిఉత్పత్తుల కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కల్లు సేకరణతో ఉత్పత్తులను అధికంగా తయారు చేయవచ్ఛు ప్రస్తుతం జీడిమామిడి సీజన్‌ కావడంతో రైతులు కల్లును తీసుకురావడం లేదు. మూడు నెలలపాటు తాటి ఉత్పత్తులను తయారు చేశాం. ప్రస్తుతం కల్లు సేకరణ నిలిచిపోవడంతో ఉత్పత్తులకు ఆటంకం ఏర్పడింది.