ముగిసిన జయంతి ఉత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముగిసిన జయంతి ఉత్సవాలు

యాదాద్రి, మే17, (way2newstv.com)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీనర్సింహ్మ స్వామి వారి కొండపైన బాలాలయంలో జరిగిన మూడు రోజుల జయంతి ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం  పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు   న్రుసింహ్మ ఆవిర్బావ ప్రవచనంతో ఉత్సవాలు ముగిసాయాని ఆలయ ప్రధాన ఆర్చకుడు  నల్లందీగల్ నర్సింహ్మ చార్యులు తెలిపారు.


ముగిసిన జయంతి ఉత్సవాలు

శుక్రవారం  ఉదయం బాలాలయంలో స్వస్థివాచనంతో ప్రారంభమై వేద పండితుల మంత్రోచ్చారణతో పూర్ణాహుతి హోమం నిర్వహించి స్వామి వారిని ఆవాహనం చేసుకుని 1008 కళశాలతో సహస్త్ర కళశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  ఆ కళశాలలో ఉన్న జలాలతో స్వామి వారిని అభిశేకించారు. అనంతరం ఉభయ దర్శనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న భక్తులకు స్వామి వారు కృపా కటాక్షలు కలుగుతాయి సర్వం సిద్దిస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు నల్లందీగల్ నర్సింహ్మ చార్యులు భక్తులకు వివరించారు.