ఇంటర్ కాలేజీలపై సర్కార్ నజర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటర్ కాలేజీలపై సర్కార్ నజర్

హైద్రాబాద్, మే 8,(way2newstv.com)
ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను కేంద్రంగా చేసుకొని నిబంధనలు రూ పొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపిం దని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి జయప్రద బాయి స్పష్టం చేశారు. ఆ నిబంధనల్లో భాగంగానే జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు నూతన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియేట్ బోర్డు సూచించింది. అందులో భాగం గానే జిల్లాలోని 322 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అడ్మిషన్ల విషయంలో అక్ర మాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. కళాశాలలు, హాస్టళ్లకు అను మతులు పొందాలంటే ఈ ఏడాది ప్రవేశపెట్టిన నిబంధ నలు పాటించాల్సి ఉంది. 


ఇంటర్ కాలేజీలపై సర్కార్ నజర్

నిబంధనలు కఠినంగా ఉండ డంతో హైదరాబాద్ జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ కళాశాలలు కలిపి మొత్తం 322 కాలేజీలున్నాయి. వీటిలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, మిగిలిన 301 కాలేజీలు ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలున్నాయని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారిణీ జయప్రద బాయి స్పష్టం చేశారు. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలు కలిపి 137 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 185 కాలేజీల పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు వివరించారు. వెబ్‌సైట్‌లో పొందుపర్చిన కా లేజీల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే అనుమతులు ఇస్తున్నారు. నాణ్యమైన విద్య పేరు తో సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన భోజనం కూ డా విద్యార్థులకు అందించడం లేదు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇంటర్ కళాశాలలు, వసతి గృహాల అనుమతుల విషయంలో దృష్టి సాధించింది. అందుకోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించి అమలు చేసేందుకు అదేశాలు జారీ చేసింది.  విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు నిపు ణులను అందుబాటులో ఉండేవిధంగా కళాశాలల యాజ మన్యాలు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతినెల విధిగా పేరంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి సెలవు దినాల్లో విద్యా ర్థులను తల్లిదండ్రులు కలుసుకునే విధంగా చర్యలు చేప ట్టనున్నారు. ఉదయం 6గంటల తర్వాత మాత్రమే విద్యా ర్థులను నిద్రలేపి రాత్రి 10గంటలలోపు నిద్రించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయ బోయే నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో అమలు చేయాల్సి ఉంటుంది.