దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహాలు నివాళులు అర్పించారు. బడుగు, బలహీన, దళిత వర్గాలకు న్యాయం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి అనేక మందిని నాయకులను చేశారాని, మాండలిక విధానం ద్వారా అధికార వికేంద్రీకరణ చేసిన మహనాయకుడు పేర్కొన్నారు. పటేల్, పట్వారీ విధానాన్ని రద్దు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని మరణించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి
ఎన్ టీఆర్ ను మానసికంగా దెబ్బ తిసి పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని, 25 సంవత్సరాల తరువాత ప్రజలకు ఆర్డమైనది అందుకే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే గా, పార్టీ అధ్యక్షుడుగా రాజీనామా చేసి పార్టీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని కోరారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవడమే ఎన్టీఆర్ మరణానికి కారణమైందని, టీడీపీ జెండాను చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారని మోత్కుపల్లి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని తిరిగి బతికించుకోవాలంటే, చంద్రబాబు చేతుల్లోంచి పార్టీ పగ్గాలను నందమూరి ఫ్యామిలీ తీసుకోవాలని సలహా ఇచ్చారు.