బాబు-జగన్ నివాసాల వద్ద భారీ భద్రత..

హైదరాబాద్ మే 22 (way2newstv.com)
గురువారం దేశ వ్యాప్తంగా ఎన్నికల లెక్కింపు జరగబోతుంది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించబోతుండడం తో పోలీసులు భారీ భద్రత ఏర్పటు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

బాబు-జగన్ నివాసాల వద్ద భారీ భద్రత..

టీడీపీ, వైసీపీ తరపున ఎమ్యెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆయా పార్టీ అధినేతల ఇళ్లకు, కార్యాలయాలకు అనుచరులతో కలిసి వచ్చే అవకాశం ఉండడం తో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రెండేసి కంపెనీల బలగాలు పహారా కాస్తాయి...
Previous Post Next Post