టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ మే 28 (way2newstv.com)
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. మంగళవారం ఆయన జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5:30 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న నటులు ఇద్దరూ సమాధిపై పూలు చల్లి ఘనంగా నిర్వహించారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు..
పాక్ సాయంతో నియంత్రణా రేఖ వెంట 16 ఉగ్రవాద శిబిరాలు
ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కళకళలాడాల్సిన ఎన్టీఆర్ ఘాట్, అలంకరణ లేక బోసిపోగా, దీన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు. తానే స్వయంగా ఎన్టీఆర్ సమాదిపై పూలు జల్లారు. ఎన్టీఆర్ సమాది వద్ద అలంకరణ చేయకపోవడంపై ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు.