మంత్ర జలంతో పిశాచి మటుమాయం

మంత్రాలయం మే 17, (way2newstv.com
రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబూదేంద్ర తీర్థులు ఒక మహిళ కు ఆవరించిఉన్న   పిశాచిని మంత్ర జలంతో వెళ్ళకొట్టిన సంఘటన రాఘవేంద్ర స్వామి మఠం లో జరిగింది. రాఘవేంద్ర స్వామి కృపా కటాక్షాలతో పీఠాధిపతులు మంత్రించిన జలమును పిశాచి ఆవరించి ఉన్న మహిళా పై చల్లి  పిశాచి నుంచి భక్తురాలిని విముక్తురాలిని చేశారు. 


మంత్ర జలంతో పిశాచి మటుమాయం 

భూత ప్రేత పిశాచి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అనంతరం ఆమె మామూలు మనిషి అయింది. దీంతో పీఠాధిపతులు ఆశీర్వదించారు. ఇంక మీకు ఎటువంటి పిశాచాల పీడ ఉండదని రాఘవేంద్ర స్వామి ఆరాధించండి అని భక్తురాలికి మంత్రాక్షితలు ,యంత్రము ఇచ్చి ఆశీర్వదించారు.రాఘవేంద్ర స్వామి మఠం లో పీఠాధిపతి మహిమలను కళ్ళారా చూసిన భక్తులు గౌరవభక్తి భావంతో భక్తులు అచంతలమచన భక్తి భావాలతో పీఠాధిపతులదగ్గర  ఆశీర్వాదం తీసుకున్నారు. పీఠాధిపతులు భక్తులందరినికి  మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం రాఘవేంద్ర స్వామి అని  భక్తుల కోరికలను ఎప్పుడు రాఘవేంద్ర స్వామి నెరవేరుస్తాడని ఈ సందర్భంగా భక్తులకు పీఠాధిపతులు తెలిపారు.
Previous Post Next Post