కౌతళం మే 3 (way2newstv.com)
కరువు సంసిద్దతా పథకము పల్లెజీవం పథకంలో భాగంగా రైతుల క్షేత్ర దినోత్సవాన్ని మండల పరిధిలోని బాపురం గ్రామం లో సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించరు.ప్రస్తుత కరువు పరిస్థితులలో పంటల యాజమాన్యం ఎలా ఉండాలి అనే విషయాల పైన రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో లో విత్తన శుద్ధి విత్తనం మొలకెత్తడం పంటలలో ఖర్చు తగ్గించడం కషాయాలు తయారుచేయడం పంటలను ఆశించి పురుగులు తెగుళ్లు నివారించడం వంటి అనేక విషయాలు గత డిసెంబర్ నుంచి నేటి వరకు రైతులకు అవగాహన కలిగించడం జరిగినది.
రైతుల వ్యవసాయ క్షేత్ర దినోత్సవ వేడుకలు
రైతు బడి లో జరిగిన కార్యక్రమాలలో సాధించిన ప్రగతిని మరియు నేర్చుకున్న విషయాలను అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఖరీఫ్ కాలానికి వర్షపాతం చాలా తక్కువగా ఉన్నదని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. తక్కువ వర్షపాతానికి మన ప్రాంతంలో ఏ రకమైన పంటలు వేయాలి అని ప్రజలు చర్చించడం జరిగింది. అందుకు తక్కువ వర్షపాతం ముఖ్యంగా పంటలు సజ్జ ,కంది ,కొర్ర వంటి నవధాన్యాలతో వ్యవసాయం చాలా అనుకూలమని అందరికి తెలియజేయడం జరిగింది. అంతే గాక ఆధునిక పద్ధతుల ద్వారా తక్కువ వర్షపాతం తో చిరుధాన్యాల పంటల యాజమాన్యం గురించి వివరించడం జరిగినది ఈ కార్యక్రమం శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామి ఉపాధి దారుల సంఘం చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్య నిర్వాహక సంస్థ అయిన సుస్థిర వ్యవసాయ కేంద్రం నుంచి ఎస్ శివప్రసాద్, ఉమా మహేశ్వర రావు అంతేకాక సహాయ సంస్థ అయిన అపార్ట్ సంస్థ నుంచి హబీబ్, ఉమర్ భాషా, ప్రభావతి ,హాజరయ్యారు.