నాగర్ కర్నూలు, మే 6, (way2newstv.com)
నాగర్ కర్నూలు జిల్లాలో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని ఏడు జెడ్పిటిసి స్థానాలకు, 88 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, బిజినాపల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి ఏడు మండలాల లో ఎన్నికలు కొనసాగాయి.
నాగర్ కర్నూలు లో పోలింగ్ ప్రశాంతం
జిల్లాలో మొత్తం 91 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... అందులో రెండు ఏకగ్రీవం అయ్యాయి. , నాగర్ కర్నూల్ మండలం లోని గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. గట్టి బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి.. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయమే పెద్దఎత్తున ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు.