రష్యాలో...సెక్స్ ట్రైనింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రష్యాలో...సెక్స్ ట్రైనింగ్

మాస్కో, మే 14, (way2newstv.com)
సెక్స్.. ఈ పదాన్ని బహిరంగంగా అనాలంటేనే ఇబ్బంది పడతారు. భారత్‌ సహా ఎన్నో దేశాల్లో దీని గురించి మాట్లాడేందుకు నామోషీగా ఫీల్ అవుతారు. అది అసభ్యకర పదం అని వ్యాఖ్యానిస్తారు. రష్యాలో కూడా సెక్స్ గురించి మాట్లాడేందుకు భయపడతారు. సోవియట్ కాలంలో ‘సెక్స్‌ కేవలం పిల్లలు పుట్టడానికే’ అంటూ ప్రచారం చేశారు. దాంతో దాని గురించి ఎవరూ అంతగా మాట్లడరు. ఇప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంప్రదాయ విలువల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, ప్రజల్లో సెక్స్ గురించి భయాన్ని పోగొట్టేందుకు కొందరు సెక్సాలజిస్టులు నడుం బిగించారు. అది అసభ్య పదం కాదు.. నేర్చుకోవాల్సిన మంచి సబ్జెక్టు అని అవగాహన పెంచుతున్నారు.


రష్యాలో...సెక్స్ ట్రైనింగ్

ట్రైనింగ్ కోర్సులు ఏర్పాటు చేస్తూ సెక్స్ కోచ్‌ల అవతారం ఎత్తారు. టీవీ షోలల్లో శృంగారంపై, దాని అవసరాలపై చెబుతున్నారు. మహిళలకు సంబంధించిన మ్యాగజైన్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు.కోచ్ అవతారం ఎత్తడంపై విక్టోరియా ఫ్రాంక్ అనే వైద్యురాలు మాట్లాడుతూ.. ‘సెక్స్ కోచింగ్ అంటే శృంగారానికి సంబంధించిన టెక్నిక్ చెబుతామని కాదు. దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడని వారిని మానసికంగా ధృడంగా చేయడమే’ అని వెల్లడించారు. రష్యాలో మహిళలు సెక్స్ గురించి బహిరంగంగా మాట్లడలేరని, వారిని ఆ ఆలోచనలలోంచి బయటకు తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నమని వివరించారు. నిజానికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినపుడు సెక్స్ పరిశ్రమ అమాంతం పెరిగింది. వీడియోలు, సినిమాలు, మ్యాగజైన్లలో దీని గురించి ఎక్కువ కావడంతో ప్రజలు దాని నుంచి దూరంగా జరిగారు.గత పదేళ్లలో రాజకీయాలు సెక్స్ గురించి ఓపెన్‌గా చర్చకు దూరం జరిగాయని, సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాయని, అయితే ఇప్పుడు సెక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని యెలేనా రిద్కినా అనే సెక్స్ కోచ్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో రాజకీయాల గురించి చర్చ కంటే సెక్స్ గురించి చర్చ జరిగితేనే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారట. ప్రజలు శృంగారం గురించి మాట్లాడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట.