ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముగిసిన.. ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముగిసిన.. ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరం


విద్యార్థులకు ప్రోత్సాహం.. తల్లిదండ్రుల్లో ఆనందం..!
ప్రతిభా పురస్కారాలను అందజేసిన 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు
సిద్దిపేట, మే 20 (way2newstv.com)
సిద్ధిపేటలోని గురుకృప జూనియర్ కళాశాలలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత సమ్మర్ క్యాంపు శిబిర ముగింపు ఉత్సవం ఆదివారం ఎంసీహెచ్ బురుజు ఆవరణలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముగిసింది. నాలుగవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఆధ్వర్యంలో 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేకించి గణితం, ఇంగ్లీషు, లాంగ్వేజ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్  అనే అంశాలతో పాటుగా భాష, తార్కిక, జీవిత నైపుణ్యాలు అన్న అంశాల పై దాదాపు నెల రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించినారు. ఈ సందర్భంగా 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు మాట్లాడుతూ..పిల్లల చదువే తల్లితండ్రులకు ఆస్తిపాస్తులని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ప్రతివ్యక్తి జీవితానికి పదవ తరగతి తొలిమెట్టు అయితే., ఇంటర్మీడియట్ అనేది వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ లాంటిదని.. విద్యార్థులను మంచిగా చదివించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దితే.., వారి చదువులే తల్లిదండ్రులకు ఆస్తులుగా మిగులుతాయని తెలిపారు. 



ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముగిసిన.. ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరం 


విద్యార్థులకు చదువు కోసం ఏ అవసరమొచ్చినా.. సహాయ సహకారాలు అందిస్తానని 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు భరోసా ఇచ్చారు. త్వరలోనే మన వార్డులోని అంగన్ వాడీ కేంద్రంలో చదివే విద్యార్థులకు డిజిటలైజ్డ్  సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం కోసం తన వంతు సహకారం అందించనున్నట్లు తెలిపినారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందివ్వాలని వారి తల్లిదండ్రుల్లో ఆనందం చూడాలని.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మన వార్డు అభివృద్ధిలో భాగంగా చదువు కూడా ఎంతో ముఖ్యమైనదని చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే వారు మరింత ముందుకు సాగుతారు. పిల్లల పై ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తారని వారి ఆశలను వమ్ము చేయకుండా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. సిద్ధిపేట పట్టణ విద్యార్థులుగా మీరు ఎంతో అదృష్టవంతులని., మిమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా.., ఇంకేమయినా సాయం కావాలన్నా.. మనకు మన గౌరవ మంత్రి వర్యులైన హరీష్ రావు అన్న ఉన్నారని చెప్పారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక ప్రణాళిక అవసరమని, ప్రణాళికను రూపొందించి ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చునని పేర్కొనడం జరిగింది. పట్టుదల, ఏదైనా చేయాలన్న తపన, అంకితభావం, శ్రద్ధ ప్రతి వ్యక్తిలో కలిగి ఉండాలని అప్పుడే తాము చేయాలనుకున్న ప్రతి పని తప్పకుండా విజయవంతంగా పూర్తి అవుతుందని తెలిపినారు. చదువు విషయంలో పిల్లల్లో ఒత్తిడిని పెంచవద్దని, ముఖ్యంగా టార్గెట్ ల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారని దానివల్ల ఇబ్బందులు కలుగుతాయని, పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చదువుపై శ్రద్ధ పెట్టి ఫలితాలు సాధించాలని తెలిపారు. ర్యాంకుల కోసం  పరుగులు తీయడం కంటే.. జీవితంలో  బాగు పడాలని ఆలోచన క్రమశిక్షణ కలిగి ఉండే విధంగా నేర్పించాలని తల్లిదండ్రులే మన పిల్లలకు మార్గనిర్దేశం చేసేలా ఉండాలని కోరారు. ఒత్తిడి వల్ల అనుకున్నది సాధించలేక పోతారని ప్రశాంత వాతావరణంలో  చదువులు ఉంటే అనుకున్నది సాధిస్తారు. అంతకు ముందు ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ.. 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. మన వార్డులోని పేద మధ్య తరగతి విద్యార్థులు చాలా మంది చదువుకుంటారని వారందరికీ ఇలాంటి సమ్మర్ క్యాంపులు నిర్వహించి, ముఖ్యంగా 7వ తరగతిలోపు విద్యార్థుల వరకు, వారిలో ఇప్పటి నుంచి చదువులు, క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారిని ప్రోత్సహించడం.. వారిలో ఉతేజాన్ని నింపి మేమున్నామంటూ.. కౌన్సిలర్ దంపతులు దీప్తి నాగరాజు చేస్తున్న కృషిని అభినందించారు.ఈ సందర్బంగా సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవంలో నెల రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులు చేపట్టిన ఆట పాటలు.. డ్యాన్సింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.