కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

అదోని,  మే 02 (way2newstv.com):
కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని..స్థానిక షరాప్ బజార్ వెంగలపురం ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఖాళీ స్థలంలో కొంత మంది కబ్జాదారులు అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నారని వారిని అధికారులు గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని నగర్ ప్రముఖ వడ్డె రాము డిమాండ్ చేశారు. గురువారం దేవాలయం చుట్టుపక్కల జరుగుతున్నటువంటి నిర్మాణాలను హిందు వాహిని కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖ్ రాము మాట్లాడుతూ వెంగలపురం ఆంజనేయస్వామి దేవాలయం అనుకుని 7 అంగళ్ళు ఉన్నాయని, గతంలో వాటిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికిని సంబంధిత ఏవో లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారాన్ని ఆరోపించారు.


కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

ప్రస్తుతం దేవాలయం పక్కన ఉన్నటువంటి పురపాలక సంఘానికి సంబంధించి నటువంటి కాలి స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేసి ఆ స్థలంలో అక్రమంగా దుకాణం నిర్మించారన్నారు. పురపాలక పట్టణ ప్రణాళిక అధికారులు వారితో కుమ్మక్కై ఈ తంతు అంత నడిపారని ఆరోపించారు. భక్తులు కాలనీవాసులు ఆ స్థలంలో విడిది రూము నిర్మించి భక్తులకు దేవాలయంలో తగిన సౌకర్యాలు కల్పించాలని గతంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గారికి విన్నపం చేసుకున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఆ వినతి పైన నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం విచారకరమన్నారు. కావున వెంటనే సంబంధిత ఎండోమెంట్ అధికారులు, పురపాలక అధికారులు స్పందించి అక్రమ కట్టడం నిర్మిస్తున్న వారిని గుర్తించి వెంటనే వారిపై మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్, రాజేష్, పరమేష్, బ్రహ్మ, శీన, మహదేవ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.