మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
వరంగల్ అర్బన్ మే 7 (way2newstv.com)
ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ఓదార్చేందుకు బిజెపి ప్రతినిధులు బండారు దత్తాత్రేయ ఎంపి మాజీ కేంద్ర మంత్రి నేతృత్వంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి , రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి , యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు గుండాగోని భరత్ గౌడ్ ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం దర్గా కాజీపేటలో ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన విద్యార్థి మోడేం భాను కిరణ్ యొక్క తల్లితండ్రులను మోడేం సత్యనారాయణ రామ దంపతులను పరామర్శించారు.
విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం.
బిజెపి నాయకులు మర్థినేని ధర్మారావు, ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, మామిడాల నరేందర్, కొలను సంతోష్ రెడ్డి, సంగని జగదీశ్వర్, చిర్ర నర్సింగ్ గౌడ్, ఎండి చాంద్ పాషా, మార్టిన్ లూథర్, పెరుగు సురేష్, అడగట్ల హరిశంకర్, జాఫర్, శివాజీ, జీవన్, వెంకట్ రావు, తదితరులు ఉన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని అన్నారు. ఇప్పటి వరకు కూడా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర మంత్రులు గాని పరామర్శించక పోవడం చాలా బాధాకరమని అన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలిని.ఇంటర్ పలితాలలో అవకతవకలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమైనదని పలితాలలో అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 26 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి తల్లిదండ్రులను పరామర్శించే కనీస ప్రయత్నం కూడా తెరాస నేతలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్లోబరీనా సంస్థను రద్దు చేసి చనిపోయిన ఒక్కోక్క విద్యార్ది కుటుంబానికి కనీసం 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి. ఇంటర్ పలితాలలో అవకతవకలపై వాస్తవాలు బయటకు వచ్చి దోషులను శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుందని ఆయన అన్నారు