పేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ

జగిత్యాల మే 04 (way2newstv.com)
ప్రతిఏటా రంజాన్ మాసంలో పురస్కరించుకుని నిరుపేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా రంజాన్ పండుగ ఉపవాస దిక్షలు బుధవారం నుండి ప్రారంభం కానందున హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల శాఖ ట్రస్టు కార్యాలయంలో జిల్లాలోని 300 మంది నిరుపేద వితంతువులకు ,వారి పిల్లలకు  ట్రస్టు అధ్యక్షుడు ఖాజ సలావోద్దిన్ చేతుల మీదిగా  రంజాన్ కిట్స్ ,బట్టలు పంపిణీ చేశారు.


పేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ

 ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ నిరుపేద వితంతువులు ఆర్థిక పరిస్థితులకు గుర్తించి ప్రతిఏటా రంజాన్ మాసం రంజాన్ కిట్స్ తన ట్రస్టు ద్వారా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. వారి కుటుంబాలు సుఖ సంతోషలతో రంజాన్ పండుగ జరుపుకోవలన్నారు.ఈకార్యక్రమంలో డాక్టర్. ముదస్సిర్ ఓద్దిన్ ,ఇసాఖ్ అలీ ,శోయబ్ ఉల్ హఖ్ ,ఆన్సారి ,ఇమాద్దిన్ ఉమేర్ తదితరులు పాల్గొన్నారు.