నారాయణపేట, మే 13, (way2newstv.com)
నారాయణ పేట జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ మూడో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మంగళవారం రేపు జరగబోయే ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. బాలెట్ పత్రాల పంపకం కేంద్రం వద్ద ఎన్నికల అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకట్ రావు జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని మూడవ విడత ఎన్నికల్లో 4జడ్పీటీసీ స్థానాలు,55ఎంపీటీసీ స్థానాలకు 3ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
స్థానిక ఎన్నికలకు అంతా సిద్దం
మిగతా ఎన్నికలు జరిగే స్థానాలకు గాను 275పోలింగ్ కేంద్రాలకు గాను మొత్తం సిబ్బంది1650 సోమవారం నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ,మరికల్ మండలాల్లో ఎన్నికల విధులలో పాల్గొనే మొత్తం సిబ్బంది సామగ్రి తీసుకున్నారు. సామగ్రి పరిశీలన కేంద్రాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగనట్టు చూడాలని స్థానిక ఎంపీడీఓ, ఎమ్మార్వోలకు సూచనలను ఇచ్చారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ చేతన ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు