బేతంచర్ల సర్పంచ్ పీఠం బీసీలకు దక్కేనా ? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బేతంచర్ల సర్పంచ్ పీఠం బీసీలకు దక్కేనా ?

బేతంచర్ల  మే 02 (way2newstv.com):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956న పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు బేతంచర్ల గ్రామం గ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ పీఠం బీసీలకు అందని ద్రాక్షలా మిగిలి ఉంది ఈసారైనా సర్పంచ్ పీఠం బీసీలకు దక్కేనా అన్నది చర్చనీయాంశంగా మారింది పంచాయతీ ఏర్పడిన నాటి నుండి దాదాపు 58 ఏళ్లపాటు ఓసి జనరల్గా సర్పంచ్ పదవి ఎన్నికలు జరిగాయి అందులో ఒక దఫా మాత్రమే ఓసి మహిళకు రిజర్వేషన్ లభించడం జరిగింది 


బేతంచర్ల సర్పంచ్ పీఠం బీసీలకు దక్కేనా ?

2014 నాటికి 58 సంవత్సరాల అనంతరం ఎస్సీ మహిళలకు సర్పంచ్ రిజర్వేషన్ లభించింది దీంతో బొద్దుల రోజమ్మ సంవత్సరాలపాటు సర్పంచ్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది అయితే పంచాయతీ పరిధిలో అధికంగా ఉన్న వెనక బడిన తరగతులకు చెందిన వారికి ఇప్పటికీ సర్పంచ్ పదవి అందని ద్రాక్షగానే మిగిలి ఉండగా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా బేతంచర్ల సర్పంచ్ పదవి బీసీలకు రిజర్వేషన్ అయినా లేక మరో యాభై ఎనిమిదేళ్లు ఎస్సీల మాదిరిగానే బీసీలు ఎదురు చూడాలా అన్నది వేచి చూడాల్సిందే