వడ్డీలను మాత్రమే చెల్లించుకుని పంట రుణాలను రెన్యూవల్ చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వడ్డీలను మాత్రమే చెల్లించుకుని పంట రుణాలను రెన్యూవల్ చేయాలి

తుగ్గలి మే 04 (way2newstv.com)
ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల పంట రుణాలకు సంభందించి వడ్డీలను మాత్రమే చెల్లించుకుని పంట రుణాలను రెన్యూవల్ చేయాలని సీపీఐ నాయకులు నబి రసూల్ మరియు మండల రైతులు డిమాండ్ చేశారు.2019 ఆర్థిక సంవత్సరంనకు సంభందించి 10-05-2019 తేదీ నుండి 12-07-2019 తేది వరకు గ్రామాల వారీగా పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ తెలియజేయారు.


వడ్డీలను మాత్రమే చెల్లించుకుని పంట రుణాలను రెన్యూవల్ చేయాలి

దీనిపై తుగ్గలి మండలం తుగ్గలి గ్రామీణ బ్యాంక్ పరిధిలోని గల రైతులు 2018 సంవత్సరంకు సంబంధించి బ్యాంక్ అందజేసిన రుణాలకు వడ్డీని మాత్రమే చెల్లించుకుని పంట అప్పులను రెన్యూవల్ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.2018 సంవత్సరంలో తీవ్రమైన కరువుతో రైతులు సరైన పంటలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు బ్యాంక్ అధికారులకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మండలలోని రైతులు తదితరులు పాల్గోన్నారు.