రీపోలింగ్ పై భయమేందుకు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రీపోలింగ్ పై భయమేందుకు

హైదరాబాద్ మే17, (way2newstv.com)
ఆరు వారాల్లో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అంశంపై చంద్రబాబు దృష్టిసారించకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారని మా పార్టీ చంద్రగిరి అభ్యర్ది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని వైకాపా అధికారప్రతినిధి  అంబటి రాంబాబు వెల్లడించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రగిరిలో మా అభ్యర్ది ఏడు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వ హించాలని ఏప్రిల్ 12 వతేదీన ఫిర్యాదు చేశారు. దానిపై కూలంకషంగా విచారించి ఈసి ఐదు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘంకు అన్ని సాక్ష్యాధారాలు అందచేసిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడింది. దీనిపై చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ నానా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. 


రీపోలింగ్ పై భయమేందుకు

చంద్రబాబు రీపోలింగ్ అప్రజాస్వామికం అని ప్రకటిస్తున్నారు.రీపోలింగ్ అప్రజాస్వామికం అని ఎలా చెబుతారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం అన్నట్లుగా ఉంది. చంద్రబాబు తీరు చూస్తే శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే  యత్నం చేస్తున్నారు.ఆయనో రాజులాగా వారి అబ్బాయి యువరాజులా ఉండాలని భావిస్తున్నట్లున్నారు. వెబ్ క్లిప్పింగ్ లలో దృశ్యాలు సరైనవా కావా అనేది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలి. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరిలో ఐదు కేంద్రాలలో రీపోలింగ్ జరిపితే టిడిపికి భయమెందుకు. రీపోలింగ్ వల్ల ఏదో గందరగోళం జరుగుతుందని చచ్చు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు  ఈవిఎంలపై, వివిప్యాట్లపై, ప్రజాస్వామ్యంపై, ఎన్నికలపై, ప్రజలపై విశ్వాసం లేదు. ఆయనకు ఎవరిపై దేనిపై విశ్వాసం ఉందో చెప్పమనండి. చంద్రబాబు జూన్ 8 వతేదీవరకు ముఖ్యమంత్రిని అన్నారే కాని ఆ తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పలేకపోయారే. తాను ఓడిపోబోతున్నట్లు చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఇలాంటి మాటలు ఆయన నోటినుంచి వచ్చాయని అన్నారు. పోలింగ్ పూర్తి అయినప్పటినుంచి చంద్రబాబు మాటతీరులో మార్పు వచ్చింది.  చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు.అలా విశ్వాసం లేని వారు రాజకీయాలలో పనికిరారు. పదవి పోయేటప్పుడు చంద్రబాబుకు ఎవరిపైనా నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంలో ఏవిధమైన ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని రాంబాబు అన్నారు.