ఇడుపుల పాయలో వైఎస్ జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇడుపుల పాయలో వైఎస్ జగన్

కడప మే 17, (way2newstv.com
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం  పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు.  తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి మూడు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. 


ఇడుపుల పాయలో వైఎస్ జగన్

అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గోన్నారు. పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు,  అభిమానులు ఘాటు ప్రాంగణానికి తరలివచ్చారు. తరువాత జగన్ ఇడుపులపాయ నుంచి హైదరాద్ కు బయలుదేరి వెళ్లారు