జిల్లా సంయుక్త పాలనాధికారి వనజా దేవి
పెద్దపల్లి మే 07(way2newstv.com)
ప్రజలు భాసవేశ్వరుని అడుగు జాడలలో నడవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి అన్నారు.మంగళ వారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాసవేశ్వరుని జయంతి నిర్వహించారు.ఈ సందర్భంగా జె.సి.మాట్లాడుతూ భసవేశ్వరుడు (1134-1196)హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకడని,ఇతడిని బసవన్న భాసవుడు అని,మరియు విశ్వ గురువు అని పిలుస్తారని సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాదీ లింగాయత ధర్మం స్థాపించారని అన్నారు.
భసవేశ్వరుని అడుగు జాడలలో అందరూ నడవాలి
కర్ణాటక లోని భాగేవాడి ఇతడి జన్మ స్థలం,తండ్రి మాధిరాజు,మాదంబ చిన్న వయస్సులోనే శైవ పురాణ గాధాలను అవగతం చేసుకున్న భాసవనికి కర్మకాండ పై విశ్వాసం పోయిందని,ఉపనయనం చేయ నిర్చయించిన తల్లి తండ్రులను వదిలి కూడల సంగమ అనే పుణ్యక్షేత్రం చేరిన భాసవుడు అక్కడ విచ్చిసి యున్న సంగమేశ్వరుని నిష్ట తో ధ్యానించాదాని, దేవుడు అతని కలలో కనిపించి అభయ మిచ్చాడని దేవుడు ఆనతి మేరకు మంగల వాడ కల్యాణ పురం చేరుకున్నడని, ఇతడు 12 వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జులుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి అతని ఖండా గారనికి ప్రధాన అధికారి అయి బండారి బసవడుగా ఖ్యాతి పొందడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన శాఖ అధికారి వెంకటేశ్వరీ,కలెక్టరేట్ ఏ.ఓ. రాజేశ్వర్,కలెక్టరేట్ సిబ్బంది పాల్ సింగ్,సునీత,భవాని ప్రసాద్ ,కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
telangananews