ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్,


అమరావతి, మే 28 (way2newstv.com
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒకే విమానంలో ప్రయాణం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ, రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వీరికి ఆహ్వానం అందింది. 


ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్, 

ఇదే రోజున అమరావతిలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్, గవర్నర్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా వెళ్లేందుకు సిద్ధమైతే ముగ్గురు ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది. 
Previous Post Next Post