ఎన్నికల ప్రకటనతో జగన్ లండన్ టూర్ వాయిదా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల ప్రకటనతో జగన్ లండన్ టూర్ వాయిదా

హైద్రాబాద్, మే 4, (way2newstv.com
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ వాయిదా పడింది.  జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలసి లండన్ వెళ్లాల్సి ఉంది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్దామని అనుకున్నారు. ఈనెల 12న మళ్లీ తిరిగి రావాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లారు. ఇప్పుడు కుమార్తె వద్దకు వెళ్లి కొన్ని రోజులు ఉండి రావాలనుకున్నారు. అయితే, జగన్ టూర్ సడన్‌గా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలపై ఫణి తుఫాన్ ప్రభావం ఉంది. భారీ ఎత్తున నష్టం లేకపోయినా, కొంతమేర ప్రభావం మాత్రం ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకోవడం మీద విమర్శలు వచ్చాయి. 


ఎన్నికల ప్రకటనతో జగన్ లండన్ టూర్ వాయిదా

ఏకంగా చంద్రబాబు కూడా జగన్ టూర్ ‌పై సెటైరికల్‌గా స్పందించారు. ‘గతంలో తుఫాన్ వచ్చిదంటే బాధితులకు న్యాయం చేయాలని ధర్నాలు చేసేవాళ్లు. ఇప్పుడు ప్రతిపక్షాలు విదేశాలు వెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రియల్ టైమ్‌లో సమీక్షిస్తూ బాధితులకు సాయం చేసింది. ఇక్కడున్నా చేసేదేం లేదన్న ఉద్దేశంతో వారు ఫారెన్ టూర్ వెళ్తున్నారు.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.మరోవైపు ఎప్పుడు తుఫాన్ వచ్చి మీద పడుతుందో అని ఉత్తరాంధ్ర ప్రజలు టెన్షన్ పడుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని మహేష్ బాబుకు చెందిన సినిమా ధియేటర్‌లో అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు వెళ్లారు. దీని మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. జనం ఇబ్బందుల్లో ఉంటే, జగన్ ఇలా సినిమాలకు వెళ్లడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఎన్నికల కమిషన్‌తో పోరాడుతూ, మరోవైపు రాష్ట్రంలో తుఫాన్ సహాయక చర్యలు చేపడుతూ అధికార పార్టీ చాలా కష్టపడుతోందంటూ చంద్రబాబు నాయుడు, టీడీపీ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. జగన్ టూర్ మీద చంద్రబాబు కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీ అధినేత తన టూర్‌ను వాయిదా వేసుకున్నారు. అయితే, పర్యటన వాయిదాకుగల కారణాలు తెలియాల్సి ఉంది. పార్టీ కార్యక్రమాల వల్ల వాయిదా పడినట్టుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వదిలి రారని, రాష్ట్రంలో సమస్యలు ఉన్నా పట్టించుకోరనే ప్రచారం ఉంది. దీంతోపాటు త్వరలో మళ్లీ ఏపీలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత జగన్ తన లండన్ టూర్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.