హైద్రాబాద్, మే 8, (way2newstv.com)
మరో ఔటర్ రింగ్ రోడ్డు రహదారి నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతూ భువనగిరి నుంచి సిద్దిపేట వరకూ సుమారు 340కిలోమీటర్ల నిడివిగల ఈ రింగురోడ్డు 50 మీటర్ల వెడల్పు తో దీనిని నిర్మిస్తారు.సుమారు 20వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ భారీ పధకానికి సంభందించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ ప్రాజెక్టు అమలుకు సంభందించి జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం వద్ద సమావేశం జరిగిందని,కేంద్రం ప్రభుత్వం ఈ సమావేశంలో కొన్ని వివరాలు అడిగిందని,ఎన్నికల నియమావళి ముగిసిన తరువాత దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని రాష్ట్ర రహదారులు,భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం తెలియచేసారు.
మరో ఔటర్ రింగ్ రోడ్డు...
అతి పెద్ద బాహ్యవలయ రహదారి కావటంతో పెద్దఎత్తున భూసేకరణ చేయాల్సి ఉందని, సుమారు 7వేల కోట్ల రూపాయలు భూసేకరణకు అవసరమని దీని లో రాష్ట్ర ప్రభుత్వ 50శాతం బారాయిస్తుందని ఆయన వివిరించారు.ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే సిద్ధిపేట నుంచి భువనగిరి వరకు అదేవిధంగా పటాన్‌చెరు నుంచి ప్రస్తుతం ఉన్న రింగు రోడ్డు ను అనుసంధానం చేస్తూ కొత్త రహదారులు అందుబాటులోనికి వస్తాయి. కలకత్తా చెన్నై ముంబై లకు రాస్ట్రంగుండా వెళ్లే జాతీయ రహదారులు గుండా రవాణా రవాణా సదుపాయాలూ మెరుగుపడతాయి.భూసేకరణ జరిగిం తరువాత సుమారు రెండు సంవత్సరాలలో దీని నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం వరంగల్ వైపు జరుగుతున్న అభివృద్ధి ఈ ప్రాజెక్టు తో మరింత అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాష్ట్ర రవాణా శాఖకు మూడువేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.వాహనాలను తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోందని,సుమారు మూడువందల కోట్ల రూపాయలు జరిమానా కింద వచ్చే అవకాశం ఉందని సునీల్ శర్మ వివరించారు