స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

రాజమండ్రి మే 16  (way2newstv.com)
స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేట్ వద్ద ఏర్పడిన గోతుల మరమ్మతుల కార్యక్రమం గురువారం ఉదయం ఆదిరెడ్డి శ్రీనివాస్, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యలను స్థానికులంతా కలిసి పరిష్కరించుకోవాలని అన్నారు. అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేట్ వద్ద ఏర్పడిన గోతులు కారణంగా ప్రయాణికుల రాకపోకలకు, అలాగే స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి గోతులు పూడ్చే కార్యక్రమం చేపట్టామని అన్నారు. 


 స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఇటువంటి సామాజిక కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమా మార్కండేయ స్వామి ఆలయ చైర్మన్ మజ్జి రాంబాబు, చందా సత్రం చైర్మన్ ఇన్నమూరి దీపు, వైద్యురాలు, మాజీ కార్పొరేటర్ వాకా కృష్ణ శ్రీ, నాయుడు, మాలే విజయలక్ష్మి, సూర్య నాయుడు, మధు వరప్రసాద్, కర్రి రాంబాబు, తంగేటి సాయి, పితా చిన్ని, నాయుడు సూర్య, బిక్కిన రవి, ఆదిరెడ్డి యువత, అధిక సంఖ్యలో స్థానిక పెద్దలు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.