బెట్టింగ్స్ లో ప్రాంసరీ నోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెట్టింగ్స్ లో ప్రాంసరీ నోట్లు

విజయవాడ, మే 4, (way2newstv.com)
కాయ్ రాజా కాయ్. ఒకటికి రెండు. రెండుకు నాలుగు. అద్భుతమైన అఫర్. ఒక్కసారి ఆలోచించండి. చిటికెలో లక్షల రూపాయలు. లేక భూములు. మీ ఇష్టం. దేనికైనా రెడీ’ అంటూ పందెం రాయుళ్లు పెచ్చరిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ బాబులు ఏకంగా బాండ్ పేపర్ల మీద రాసి మరీ పందాలు కాస్తున్నారు. ఏప్రిల్ 11న జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 


బెట్టింగ్స్ లో ప్రాంసరీ నోట్లు

ఈ మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల అది ఆసరాగా తీసుకుని బెట్టింగ్ రాయులు విచ్చలవిడిగా పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ బాబుల గురించి కచ్చితమైన సమాచారం రావడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ ఉత్తర్వులతో నార్త్ డిఎస్పీ సారధ్యంలో మంగళగిరి టౌన్ సిఐ, ఎస్సైలు నారాయణ, సిబ్బంది వెళ్లి మంగళగిరి ఆటోనగర్ లోని సహారా హోటల్ పైన గదిలో రైడ్ నిర్వహించారు.ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.10 లక్షల నగదు చేతులు మారుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.10.15లక్షల నగదు, 6 సెల్ ఫోన్ లు, ఒక కారు రెండు బైక్లు, మూడు బాండ్ పేపర్లను లను సీజ్ చేశారు. బెట్టింగ్‌లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.