ఆసక్తికరంగా జగన్ పోస్టింగ్స్


విజయవాడ, మే 22, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల సమయమే ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చేది తామంటే.. తామంటూ టీడీపీ, వైసీపీలు ధీమాతో ఉన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు తేల్చాయి. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి. అదే ధీమాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.. రాజన్న రాజ్యం రాబోతోందని.. సుపరిపాలన అందించడమే తన సంకల్పమన్నారు. 

ఆసక్తికరంగా జగన్  పోస్టింగ్స్
జగన్ తన పోస్ట్‌లో ‘రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం. ప్రజాస్వామ్యంలో ప్రజాపరిపాలనే సాగాలి. మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారు.. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందినవేళ వారికి బాధ్యుడినై ఉంటాను’అన్నారు వైఎస్ జగన్. జగన్ పోస్ట్‌తో వైసీపీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రాబోయేది రాజన్న రాజ్యమేనంటూ.. జగన్ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
Previous Post Next Post