పేదోడి ఫ్రిజ్ కు తగ్గని గిరాకీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేదోడి ఫ్రిజ్ కు తగ్గని గిరాకీ


నిజామాబాద్, మే 20, (way2newstv.com)
వేసవి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకు వచ్చేవి రంజన్లు. వేలు పెట్టి ఫ్రిజ్ లను కొనలేని పేదవారు వీటిని కొనుగోలు చేస్తుంటారు అందుకే వీటిని పేదోడి ఫ్రిజ్ అంటారు. చూడటానికి మట్టి కుండలే అయినా ఫ్రిజ్‌ల కంటే చల్లని నీటిని అందిస్తాయి. భానుడి బగబగలు…ఎండ వేడిమి ఎక్కవగా వుండటంతో వీటని గిరాకీ పెరింగింది.నిజామాబాద్ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా కళకళలాడుతున్న రంజనల్ల గిరాకీ పై స్పెషల్ స్టొరీ ఎండలు మండిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో రంజన్లు,కుండలు,కూజాలకు గిరాకీ మొదలైంది. వేసవిలోదాహాన్ని తీర్చుకునేందుకు చల్లనినీటికోసం వీటివాడకం తప్పనిసరిగా మారిపోయింది. ఫ్రిజ్‌లు లేనివారు,ఫ్రిజ్‌లు విని యోగించలేని వారంతా చల్లని నీటి కోసం మట్టితో తయారు చేసిన రంజన్లు,కుండలనే వాడతారు.చల్లనినీటికోసం వీటిపైనే ఆధారపడతారు.దీంతో వీటికి సాధారణం గా  గిరాకీ ఎక్కువనే చెప్పవచ్చు.వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వివిద రకాల రంజన్లు, కుండలను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. 



పేదోడి ఫ్రిజ్ కు తగ్గని గిరాకీ

మార్కెట్ లో వివిధ రకాల రంజన్లు ఆందుబాటులో వుండటంతో పేదలతో పాటు మధ్య,ఉన్నతవర్గాల వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మరోవైపు ఫ్రిజ్ నీరు ఆరోగ్యదాయకం కాదని వైద్యులు పేర్కొనడంతో ఆరోగ్యంతో పాటు చల్లని నీటిని అందించే రంజన్‌లు,కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్లో కుండలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయని, కుండలో నీళ్లతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నా మన్నారు. ఫ్రిజ్ల కన్నా మట్టి కుండలు వాటర్ తాగడమే బెటర్ అంటున్నారు.ఎండ వేడిని తట్టుకోలేక బయట కూల్ డ్రింక్స్, రోడ్ సైడ్ జ్యూసులు తాగే బదులు మట్టికుండలో నీరు తాగాలని మంచిదని అందుకే తాము మట్టి కుండలపై ఆసక్తి చూపుతున్నామని , రంజన్లకు ఫ్రిజ్‌లు పోటీ కాదని వినియోగదారులు చెబుతున్నారు.జిల్లాకు ఎక్కువగా ఆదిలాబాద్, రాజస్ధాన్ ల నుండి తీసుకువచ్చి విక్రయదారులు అమ్మకాలు చేపడుతున్నారు. మరోవైపు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి.బస్టాండ్, పూలాంగ్ చౌరస్తా, బైపాస్ రోడ్ లతో పాటు ప్రధాన కూడళ్లలో రంజన్లు, కుండలను విక్రయిస్తున్నారు.వివిధ సైజుల్లో, డిజైన్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రంజన్‌లు సైజు ను బట్టి 80 నుంచి 400 రూపాయల వరకు, అదే కుండలు అయితే 40 నుంచి 150 పూపాయల వరకు విక్రయిస్తున్నారు. చల్లని నీరందించే రంజన్లు సామాన్య ప్రజలకూ అందుబాటులో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కవగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ఫ్రిజ్‌లు ఉన్న వారందరూ సైతం వేసవి కాలం వచ్చిందంటే మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు.ఫ్రిజ్‌లలో నిలువ ఉండే నీళ్లుతాగడం వల్ల అనారోగ్యం బారిన పడు తున్నందునే మట్టితో తయారైన మంచినీటి కుండల వైపు ఆసక్తి చూపుతున్నారు.ఒకప్పుడు పేదలు వాడే మంచినీటి సురాయిలు ఇ ప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దర్శనమిస్తున్నా యి. అయితే మార్కెట్‌లో కొత్త కొత్త రకాలైన ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చినా.. వీటికి ఏ మాత్రం గిరాకీ తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.