ఫలితాలనిస్తున్న ఇ- పాస్ విధానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫలితాలనిస్తున్న ఇ- పాస్ విధానం

నెల్లూరు, మే 7, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలో ఇ-పాస్ విధానం ద్వారా చౌకదుకాణాల్లో రేషన్ సరుకులు పంపిణీ చయడం వలన ఏప్రిల్ నెలాఖరు నాటికి 130 కోట్ల రూపాయల మేర ఆదా జరిగింది.రేషన్ కార్డుదారులకు ఎంతో ప్రయోజనకారిగా ఉండటంతో ఊహించినదానికంటే ఎక్కువగా స్పందన లభిస్తున్నది. ప్రజాపంపిణీ ద్వారా ప్రయోజనం పొందుతున్న 2.75 కోట్ల లబ్ధిదారులకు. రేషన్ పోర్టబిలిటీని అమల్లోకి తెచ్చింది. గత పది రోజుల్లో రాష్ట్రంలోని 17,023 రేషన్ దుకాణాల్లోని 13,032 షాపుల్లో పొర్టబిలిటీ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఈ రేషన్ షాపుల నుంచి ఏకంగా 5,44,378 మంది సరుకులు తీసుకున్నారు. జిల్లాల్లో ప్రతి నెల 15తేదీ వరకు సరుకులు తీసుకొనే సదుపాయాన్ని కల్పించిన పౌరసరఫరాలశాఖ.. జిల్లాలో 20 వరకు సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పాస్ విధానం అమల్లోకి వచ్చిన ప్రతి నెలా 70-75 లక్షల కుటుంబాలు రేషన్ సరుకులు తీసుకొంటున్నాయి. 


 ఫలితాలనిస్తున్న ఇ- పాస్ విధానం

జిల్లాలో మొత్తం 8,67,504 రేషన్‌కార్డులు ఉండగా.. అందులో అన్నపూర్ణ కింద 724, అంత్యోదయ అన్నయోజన పథకం కింద 58,793, తెల్లకార్డులు 8,07,987 ఉన్నాయని వివరించారు. 2016 నాటికి తొలి విడతగా 54,081 రేషన్‌కార్డులు మంజూరు చేయగా, జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం ద్వారా రెండో విడతగా 43,970 తెల్లరేషన్ కార్డులు అందించారు.అదేవిధంగా జిల్లాలో 1896 చౌక దుకాణాలు ఉన్నాయని, అందులో ఎస్సీ- 342, ఎస్టీ- 75, వికలాంగులు- 50, గిరిజన కార్పొరేషన్- 11, సహకార సంఘాలు- 18, డ్వాక్రా- 1, మైనార్టీలు- 72, బిసి- 525, ఓసి- 641 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. జిల్లావ్యాప్తంగా 121 దుకాణాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని ఆహార సలహా సంఘ సమావేశంలో నియమించాల్సి ఉందన్నారు. రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు, లబ్ధిదారులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్‌కు సంబంధించి ఎటువంటి డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో మొత్తం 65 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ 99.75 శాతం పూర్తయిందని, గ్యాస్ కనెక్షన్ల సీడింగ్ 96.01 శాతం సాధించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో 48 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు...