హైదరాబాద్, మే 16 (way2newstv.com)
మల్కాజ్ గిరి నియోజకవర్గ దళిత నాయకుడు స్వర్గీయ కటికల రమేశ్ మన ముందు లేక పోవడం దళితులకు తీరని లోటు అని ప్రముఖ సంఘ సేవకులు మండల రాధ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.గురువారం ఆయన 4 వ వర్దంతి సందర్బంగా నెరేడిమేట్ లోని అంబెడ్కర్ భవన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కటికల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
దళిత నాయకుని వర్దంతి వేడుకలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సంఘసేవకులు మండల రాధాకృష్ణ యాదవ్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో పి.ఎస్. శ్రీనివాస్,డి.ఎన్. వెంకటేష్,చెకొండ నరేష్ బాబు,సానది శంకర్ ,మంగేష్ ,గుంటి లక్మన్, మండే సురేష్,గంగాదరి కృష్ణ,బతిని నర్సింహ,వగ్గు చంద్రశేఖర్,భాస్కర్,నందుశ్రీశై లం,సంజీవ,లక్మి పతి,శైలేష్,సామల రాజు,శివ కుమార్,శ్రీనాద్, రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews