మరమ్మతుకు నోచుకోని వై ర్లు
కౌతాళం మే 02 (way2newstv.com):
మండల కేంద్రమైన కౌతాళంలో నిఘా నేత్రాలు పనిచేయడం లేదు.అధికారులు మాత్రం చూసి చూడనట్టుగ ఉన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి.రెండు సంవత్సరాల క్రితం అప్పటి ఎస్ఐ సుబ్రహ్మణ్యం రెడ్డి మండల పరిధిలోని ప్రధాన కూడలిలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా నిఘా నేత్రాలు తో సహాయంతో వారిని పట్టుకోవచ్చని కేసులు త్వరగా పూర్తిచేయొచ్చునే ఉద్దేశంతో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరిగినది .బిస్మిల్లా సర్కిల్, బడ్డప్ప సర్కిల్ ,బస్టాండ్, రాజు టీ స్టాల్, తుంగభద్రా వైన్స్ మరియు బస్టాండ్లో లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.
పనిచేయని నిఘానేత్రాలు
అవి కొంత కాలం వరకు బాగానే పనిచేశాయి. కానీ తర్వాత వైర్లు తెగిపోవడంతో వాటి పై అధికారులకు నియంత్రణ లేకపోవడంతో సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి .కానీ దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు ఆ సీసీ కెమెరాలను పట్టించుకోకుండా ఏవైనా చిన్న సంఘటనలు జరిగినా కూడా ఏ సాక్ష్యం లేకుండా పోతున్నాయి .కేసులను త్వరితగతిన పూర్తి చేయడంలో పోలీసులు చాలా వెనకబడి ఉన్నారు.అదే నిఘా నేత్రాలు పని చేస్తూ ఉంటే ఏ కేసులోనైనా తొందరలో పరిష్కారం అయ్యేవి .ఎవరైనా తప్పి పోయినా లేకపోతే దొంగతనం జరిగిన ఇటువంటి సంఘటనలు నిగా నేత్రాలలో బందీ అయ్యొవి. కానీ ఇప్పుడు అవి పని చేయకపోవడంతో అధికారులు దాని గురించి పట్టించుకోక పోవడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి అవుతున్నాయి.ఏదిఏమైనా ప్రజలకు అధికారులకు రక్షణగా ఉండే నిఘానేత్రాలను ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన పనిచేసేటట్టు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.