ఏపీ పదవ తరగతి ఫలితాలు వెల్లడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ పదవ తరగతి ఫలితాలు వెల్లడి

ముందంజలో బాలికలు
అమరావతి, మే 14, (way2newstv.com)
ఏపీ పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. ఈ పరీక్షకు 6 లక్షల 30 వేల 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6 లక్షల 19 వేల 494 రెగ్యులర్, 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. 94.88 శాతం రెగ్యులర్ విద్యార్థులు పాస్ అయ్యారు. బాలేనే 94.68 శాతం, బాలికలు  95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 94.88శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రవేటు విద్యార్థుల్లో 61.84 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 51.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం  11,690 పాఠశాలల నుంచి  5464  స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత  సాధించాయని సంధ్యారాణి తెలిపారు.


ఏపీ పదవ తరగతి ఫలితాలు వెల్లడి

గతంలో 17 స్కూళ్లలో సున్నా పాస్ పర్సంటేజ్ ఉండగా ఈసారి అది 3 పాఠశాలలకే పరిమితమయిందని ఆమె అన్నారు. ప్రధమ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా(98.19) వుండగా, చివరి స్థానంలో నెల్లూరు జిల్లా(83.19) నిలిచింది. రెండవ స్థానం  ప్రకాశం జిల్లా (98.17),  చిత్తూరు జిల్లా ( 97.41) మూడో స్థానం, నాలుగవ స్థానంలో   విజయనగరం ( 97.28),  విశాఖ జిల్లా ( 96.37) ఐదో స్థానం,   శ్రీకాకుళం జిల్లా ( 95.58) ఆరో స్థానం,  అనంతపురం జిల్లా ( 95.55)  ఏడో స్థానం,  గుంటూరు జిల్లా ( 95.35) ఎనిమిదవ స్థానం, కృష్ణా జిల్లా (93.96) తొమ్మిదవ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లా (93.29) పదవ స్థానం, కడప జిల్లా ( 92.90)  11వ స్థానం,  కర్నూలు జిల్లా ( 92.10)  12వ స్థానంలో వుంది. మరోవైపు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు 98.24 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు 87.16 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని సంధ్యారాణి స్పష్టం చేశారు.