మంత్రాలయం: మే 16 (way2newstv.com)
పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూర్వ పీఠాధిపతులైన శ్రీ వతీంద్రతీర్థుల ఆరాధన గురువారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సుబుదేంధ్రతీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు వతీంద్రతీర్థుల బృందావనానికి నిర్మాల్యము పంచామృతాభిషేకం గావించి విశేష పుష్పాలంకరణ .గావించారురాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అనంతరం వతీంద్రతీర్థుల బృందావనానికి మంగళహారతి సమర్పించారు.
* రాఘవరాయుడి కి విశేష పూజలు*
గురువారం పురస్కరించుకొని అర్చకులు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా నిర్మాల్యం పంచామృతాభిషేకము గావించి స్వర్ణ కవచ సమర్పణ విశేష పుష్పాలంకరణ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.
Tags:
News