తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదోసారి సీఎంగా గెలిచినా... దాని కంటే జగన్ సాధించిన విజయంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
జగన్ విజయం వెనుక దివ్యారెడ్డి
కారణం... బలమైన టీడీపీని అత్యంత బలహీనమైన పార్టీగా మార్చేయడంలో జగన్ సాధించిన విజయం అనిర్వచనీయమైనదంటున్నారు రాజకీయ పండితులు. సరే ఆ విషయం అలా ఉంచితే, అసలు జగన్ ఇంతలా గెలవడం వెనక రాయకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటూ... మరో మహిళ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో కాదు... సాక్షి ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి.