ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం

కౌతళం  మే 16  (way2newstv.com)
మే 28  మంగళవారం నాడు  ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని " కర్నూల్ కన్వెన్షన్ సెంటర్" లో కర్నూలు జిల్లా రెడ్డి ఉత్తమ విద్యార్థి అభినందన సభను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి  సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కన్వీనర్ సంజీవరెడ్డి  రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో  సంజీవ రెడ్డి మాట్లాడుతూ 2019 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో  పదవ తరగతిలో మరియు సీనియర్ ఇంటర్మీడియట్ లో జి పి ఏ 9.5 నుండి 10 పాయింట్లు సాధించిన రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభను నిర్వహించి సత్కరించాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు. 


ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం

ఈ అభినందన సభకు రాష్ట్ర నాయకులు, కర్నూలు జిల్లాలోని విద్యా సంస్థల అధినేతలు, విద్యారంగ ప్రముఖులు, రెడ్డి ప్రముఖులు, నియోజకవర్గాలలో ఉన్నటువంటి రెడ్డి సంఘాల నాయకులు,వన భోజన కమిటీ నాయకులు పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు అభినందించి,సత్కరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లాలో అభినందన సభను నిర్వహించి విద్యార్థులకు ప్రముఖ విద్యా రంగ ప్రముఖులచే కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించి పేద రెడ్డి విద్యార్థులు చదువుకోడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. జి పీ ఏ 9.5 నుండి 10 పాయింట్ల వరకు సాధించిన రెడ్డి విద్యార్థులు మరియు వారి కుటుంబసభ్యులు ఈ క్రింది నంబర్లకు 9985030609, 9491494947, 8985344551 మే 20వ తేదీ లోపల ఫోన్ చేసి సంప్రదించి పూర్తి వివరాలు తెలపాలని కోరుతున్నాము.*
Previous Post Next Post