సీఎస్ సాగనంపడానికే ఏపీ కేబినెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎస్ సాగనంపడానికే ఏపీ కేబినెట్

విజయవాడ, మే 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై.. ప్రభుత్వ పరంగా తీవ్రమైన చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్‌ఫెక్ట్ స్కెచ్ వేశారు. నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించిన తర్వాత ఆ జిల్లాల్లో సహాయ చర్యలపై జరిపిన సమీక్షా సమావేశానికి చీఫ్ సెక్రటరీ హాజరు కాలేదు. సీఎస్ మినహా మిగతా అధికారులందరూ రావడంతో.. వారితోనే సమీక్ష జరిపి .. నష్టపరిహారం, సహాయ, పునరావాస చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే.. సీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై.. వేచి చూసే ధోరణిలో లేరు. వెంటనే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే నేరుగా మీడియా సమావేశంలోనే  ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారని కానీ ఏపీలో మాత్రం ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాము వెళ్లి రివ్యూ మీటింగ్‌లకు రావాలని సీఎస్‌ను బతిమాలుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.  


సీఎస్ సాగనంపడానికే ఏపీ కేబినెట్

సీఎం దగ్గరికి వచ్చి మాట్లాడాలని సీఎస్‌కి తెలియదా  అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎస్ విషయాన్ని ఇలా వదలేయడానికి చంద్రబాబు రెడీగా లేరు. ఏ కోడ్ పేరుతో.. సీఎస్.. ప్రభుత్వ అధికారాలన్నీతనకు దఖలుపడ్డాయని  అనుకుంటున్నారో.. అదే కోడ్ ఉండగా ఎల్వీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రి వర్గ సమావేశం నిర్వహించి.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ఆలోచనను..మీడియా ఎదుట బయట పెట్టారు కూడా. ఏ అధికారి అియనా హద్దులు దాటితే కేబినెట్‌ భేటీ నిర్వహించి.. బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే.. ఎల్వీ హద్దులు దాటారని చంద్రబాబు స్పష్టం చేశారు కూడా. వచ్చే వారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భేటీలో ఎల్వీపై.. చర్యలు తీసుకుంటామని.. చంద్రబాబు చెప్పకనే చెప్పారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. కేబినెట్ భేటీ నిర్వహించవచ్చా  లేదా అన్నదానిపై  చంద్రబాబుకు ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే.. ఇంకా చెప్పాలంటే..మోడీనే క్లారిటీ ఇచ్చారు. కోడ్ వచ్చిన తర్వాత మోడీ ఇప్పటి వరకూ నాలుగు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారు. ఒక్క సారి కూడా.. ఈసీ అభ్యంతరం చెప్పలేదు. అందుకే.. తాను వచ్చే వారం కేబినెట్ భేటీ నిర్వహిస్తానని.. ఎవరు అడ్డుకుంటారో.. చూస్తానని సవాల్ చేస్తున్నారు. అదే సమయంలో సోమవారం పోలవరం వెళ్తున్నానని స్పష్టం చేశారు. తనను  ప్రజలు ఎన్నుకున్నారని.. తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.