10 నుంచి ఏపీ బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

10 నుంచి ఏపీ బడ్జెట్


విజయవాడ, జూన్ 20 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 10వ తేదీన ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

10 నుంచి ఏపీ బడ్జెట్
జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.