15 నుంచి బాబు సమీక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

15 నుంచి బాబు సమీక్షలు


విజయవాడ, జూన్ 12, (way2newstv.com)
న్నికల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. రాజకీయ పార్టీల సందడి సర్దుమణుగుతుంది కొద్దికాలం అనుకుంటే వేసవి తాపం లాగే రాజకీయ వేడి పెరిగిపోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా పాలనలో దూసుకుపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు అనే ఒక ప్రచారాన్ని తిరగరాసి ఇదిగో ఇలా చేయాలని చూపించేస్తున్నారు నవయువ సిఎం. పాదయాత్రలోను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వచ్చే ఎన్నికలకు ముందు కాకుండా కుర్చీ ఎక్కగానే నెరవేర్చేందుకు కంకణబద్ధుడై జగన్ సాగుతున్నారు. దాంతో కొంతకాలం ఇంటిపట్టునే వుండాలని మొదట భావించినా ఎక్కువ కాలం సైలెన్స్ పార్టీ శ్రేణులకు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని అంచనా వేసిన చంద్రబాబు ఇక తన పాత్ర పోషించేందుకు స్కూల్ తెరిచేస్తున్నారు.


15 నుంచి బాబు సమీక్షలు
ఓటమి గెలుపుకి దారి తీయాలంటే తప్పులను సమీక్షించడం ఎవరికైనా అవసరం. రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫలితాల తరువాత ఇది తప్పనిసరి. ఘోరపరాభవం తరువాత మహానాడు సైతం తాత్కాలికంగా ఎత్తేసి సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన బాబు ఇక స్కూల్ స్టార్ట్ చేసి పాఠాలు చెప్పడం మొదలు పెట్టకపోతే స్థానిక ఎన్నికల్లో కూడా చేదు అనుభవాలే ఎదురౌతాయని సీన్ లోకి దిగిపోతున్నారు. పోలింగ్ కి ముందు ఆరు పార్లమెంట్ స్థానాల్లో రివ్యూ చేసిన చంద్రబాబు ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో లోతైన విశ్లేషణకు సిద్ధం అయ్యారు.ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు వున్న నేపథ్యంలో 15 నుంచి సమీక్షలు మొదలు పెట్టేందుకు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ పిలుపులను పార్టీ కార్యాలయం మొదలు పెట్టేసింది. ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న జనసేన సైతం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల సమీక్షను పూర్తి చేసిన నేపథ్యంలో ఆవేదన దిగమింగుకుని తమ్ముళ్లు ఇప్పుడు చలో అమరావతికి బయల్దేరారు. మరి చంద్రబాబు సమీక్షల్లో ఎలాంటి నిజాలు బయట పడతాయో రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి