మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న రేటు కంటే చాలా ఎక్కువ ధరకు తమన్నా ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. జుహు-వెర్సొవా లింక్ రోడ్‌లో ఉన్న ‘బేవ్యూ’ అనే 22 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని ఫ్లాట్‌ను రూ.16.60 కోట్లకు తమన్నా కొనుగోలు చేసిందట. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ నిమిత్తం రూ.99.60 లక్షలు బిల్డర్‌కు తమన్నా చెల్లించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కానీ, ఈ విషయాన్ని తమన్నా కానీ, ఆమె మేనేజర్ కానీ స్పష్టం చేయలేదు.
16 కోట్లతో తమన్నా ఇల్లు
ఈ ఫ్లాట్‌ను తమన్నా, ఆమె తల్లి రజనీ భాటియా పేర్ల మీద జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో తమన్నా రెండు కార్ పార్కింగ్ స్లాట్స్‌ను కూడా కొనుగోలు చేశారట. కాగా, చదరపు గజానికి రూ.80,778 చెల్లించి ఈ ఇంటిని తమన్నా కొనుగోలు చేశారని రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకరు వెల్లడించారు. వాస్తవానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరలకు ఇది రెండు రెట్ల కంటే అధికమట. కానీ, బే వ్యూ చాలా బాగుండటంతో ఆ ఫ్లాట్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి డబుల్ రేట్‌ను తమన్నా చెల్లించారట. బిల్డర్ సమీర్ భోజ్వాని తమన్నాకు ఈ ఇంటిని విక్రయించారని తెలుస్తోంది. ఫ్లాట్‌లో ఇంటీరియర్ డిజైన్ నిమిత్తం మరో రూ.2 కోట్లను తమన్నా వెచ్చించనున్నారట. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె నటించిన ‘అభినేత్రి 2’ విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. హిందీ చిత్రం ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటించింది. ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో తమన్నా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే, ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 3’లో లీడ్ రోల్‌లో మిల్కీ బ్యూటీ నటిస్తోంది.