17 న ప్రారంభం కానున్న కొత్త ఎంజేపి బిసి గురుకుల విద్యాలయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

17 న ప్రారంభం కానున్న కొత్త ఎంజేపి బిసి గురుకుల విద్యాలయాలు


హైదరాబద్ జూన్ 15(way2newstv.com)
ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాలయాలు ఈ నెల 17 న ప్రారంభమవుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ పిల్లలకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన ఉచిత విద్యను ప్రభుత్వమే అందించాలనే సదుద్ధేశంతో గురుకులాల ద్వారా విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.


 17 న ప్రారంభం కానున్న కొత్త ఎంజేపి బిసి గురుకుల విద్యాలయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా గురుకుల పాఠశాలల ద్వారా విద్యను అందిస్తున్నామని  విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గురుకులాలలో సీట్ల కోసం అనేక మంది విద్యార్ధులు పోటీ పడుతున్నారని, ఫలితాలలో అద్భుతమైన ప్రగతిని సాధించామని అన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 19 గురుకుల పాఠశాలల్లో 8282 మంది విద్యార్ధులు మాత్రమే చదివేవారని, ఇప్పుడు 281 విద్యాసంస్ధలు పనిచేస్తున్నాయన్నారు. డైటీచార్జీలను పెంచడంతో పాటు యూనిఫామ్స్, కాస్మోటిక్స్. షూస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వారిని విద్యాపరంగా ఉన్నతస్ధితిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ కార్యదర్శి బుర్ర వెంకటేశం, అడిషనల్ సెక్రటరీ సైదా, బిసి గురుకులాల సొసైటి కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.