ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించే ప్రజాదర్బార్ (గ్రీవెన్సు) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సునయన ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలనుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
17న కర్నూలులో ప్రజాదర్బార్ : కలెక్టర్