కర్నూలులో 2వేలకు పైగా బెల్ట్ షాపులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో 2వేలకు పైగా బెల్ట్ షాపులు


కర్నూలు, జూన్ 6, (way2newstv.com)
దశల వారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా తొలి అడుగు పడింది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలకు కారణమవుతున్న బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా రెండు వేలకు పైగా »బెల్టు దుకాణాలు నడుస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులే అంచనా వేశారు. లైసెన్సీలు తమకు దక్కిన దుకాణాలపై లాభాలు ఆర్జించడానికి ఊరూవాడ తమ అనుయాయులతో బెల్టుషాపులను పెట్టించారు. లైసెన్సుడు దుకాణంలో నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు సాగిస్తారు. 


ర్నూలులో 2వేలకు పైగా బెల్ట్ షాపులు
కానీ బెల్టు దుకాణాలకు నిర్ణీత సమయమంటూ ఉండదు. పల్లెల్లో  ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు చివరకు గాంధీ జయంతి లాంటి సందర్భాల్లోనూ తెరిచే ఉంటున్నాయి.ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు ఎక్కడా బెల్టుషాపులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారుదీనిపై మహిళల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఐదేళ్లుగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వేళ్లూనుకుపోయాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి, గొడవలు జరగడానికి ఇవి కారణమవుతున్నాయి. బెల్టుషాపులను తొలగిస్తామంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం  మొదటి సంతకం పెట్టినా..ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. పైగా మద్యపానాన్ని మరింత ప్రోత్సహించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని స్వయాన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే వ్యాపారులుగా మారి మద్యం ఏరులై పారించారు.